- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబుతో ఫైట్ చేసే సింహం ఇదే..ఇక థియేటర్లు బ్లాస్ట్ కావాల్సిందే !
ప్రిన్స్ మహేష్ బాబు సింహంతో ఫైట్ చేస్తారట. దీనికోసం నిజమైన సింహాన్ని రంగంలోకి దించారట రాజమౌళి. ట్రైన్డ్ సింహాన్ని

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మహేష్ బాబు. ఆయన వయసు 40 సంవత్సరాలు దాటినప్పటికీ... కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారు మహేష్ బాబు. ఆయన సినిమా చేశారంటే... మినిమం గ్యారంటీ హిట్ ఉంటుంది. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు సరికొత్త సినిమాతో ముందుకు వస్తున్నారు.
రాజమౌళితో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. విదేశాల్లోనే ప్రస్తుతం ఈ షూటింగ్ జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబు సింహంతో ఫైట్ చేస్తారట. దీనికోసం నిజమైన సింహాన్ని రంగంలోకి దించారట రాజమౌళి. ట్రైన్డ్ సింహాన్ని తీసుకువచ్చి ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన... తెలుగు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నిజమైన సింహంతో ఫైటింగ్ చేస్తే థియేటర్లు బ్లాస్ట్ కావడం గ్యారెంటీ అంటున్నారు.






