SSMB 29: జక్కన్న మూవీలో మహేష్ రోల్ ఇదే.. స్టోరీ లైన్ లీక్ !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఇప్పుడు అందరి చూపు రాజమౌళి ( SS Rajamouli) అలాగే మహేష్ బాబు ( Mahesh Babu) సినిమా పైనే ఉంది.

SSMB 29: జక్కన్న మూవీలో మహేష్ రోల్ ఇదే.. స్టోరీ లైన్ లీక్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఇప్పుడు అందరి చూపు రాజమౌళి ( SS Rajamouli) అలాగే మహేష్ బాబు ( Mahesh Babu) సినిమా పైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు 29వ సినిమాను ( SSMB29 ) జక్కన్న చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సినిమా అంటేనే... చాలా స్పెషల్. ఇక ఈ సినిమా బిజీలో ఇప్పటికే జక్కన్న పడిపోయారు. అటు మహేష్ బాబు కూడా కొత్త హెయిర్ స్టైల్ తో... సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ గా ( archaeologist) ప్రిన్స్ మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మహేష్ బాబును రెడీ చేస్తున్నారట జక్కన్న. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా కామెడీ కూడా బాగా పండించబోతున్నారట. అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఎక్కువ కామెడీని పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసిలో కూడా... తీయబోతున్నారట. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ కూడా రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story