SSMB29 Leak : మహేష్ - రాజమౌళి షూటింగ్ సీన్స్ లీక్... నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-10 13:11:20  IST  )

ఎస్ఎస్ఎంబీ29(SSMB29) షూటింగ్ సీన్స్ లీకవడం(Leak) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

SSMB29 Leak : మహేష్ - రాజమౌళి షూటింగ్ సీన్స్ లీక్... నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎస్ఎంబీ29(SSMB29) షూటింగ్ సీన్స్ లీకవడం(Leak) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు టాప్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli), అగ్రనటుడు మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమా షూటింగ్ సీన్స్ నెట్టింట్లో దర్శనం ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలోని కీలక సన్నివేశాలు లీకయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మలయాళ అగ్రనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(PruthviRaj Sukumaran), బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

అయితే సాధారణంగా జక్కన్న షూటింగ్ విషయాలు అతి గోప్యంగా ఉంచుతాడు. సెట్లోకి ఎవ్వరూ ఫోన్లు, కెమెరాలు తీసుకు రాకుండా జాగ్రత్త పడతాడు. మూవీకి సంబంధించి ఏ వివరాలు బయటికి పొక్కకుండా కేర్ తీసుకుంటాడని పేరు. అలాంటిది ఏకంగా షూటింగ్ సీన్స్ నెట్లోకి రావడంతో ఇండస్ట్రీతోపాటు ఇటు మహేష్ అభిమానులు, అటు రాజమౌళి అభిమానులు షాక్ కు గురయ్యారు. లీక్ వీడియోలో ఏముందంటే.. ఎలక్ట్రిక్ వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి మహేష్ ను గార్డ్స్ నెట్టుకుంటూ తీసుకు వచ్చి, అతని ముందు మోకాళ్ళపై కూర్చోబెట్టే సన్నివేశం ఉంది. ఆ వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి పృథ్వీగా తెలుస్తోంది. చుట్టూ అడవిలా ఉన్న ఓ ఎత్తైన చోట ఈ షూటింగ్ జరుగుతున్నట్టు ఆ సీన్లో కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలోని ముఖ్యమయిన షెడ్యూల్ ఒడిషాలోని కోరాట్ పూర్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఇప్పటికే సమాచారం ఉండగా.. ఈ సీన్లు అవేనని అర్థం అవుతోంది. ప్రపంచ సాహసికుడిగా మహేష్ ను ఈ చిత్రంలో చూపించబోతున్నాను అని రాజమౌళి చేసిన ప్రకటనతో ఇప్పటికే ఈ మూవీపై భారీగా హైప్ వచ్చేసింది. షూటింగ్ కూడా అత్యంత వేగంగా నడుస్తుండగా.. ఇపుడు ఈ లీక్ జరగడం సంచలనం సృష్టించింది. కాగా ఈ లీక్ పై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. నెట్టింట్లో మాత్రం ఈ లీక్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story