తండ్రి కాబోతున్న మహేష్.. భార్య బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by I. Sairam |

జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

తండ్రి కాబోతున్న మహేష్.. భార్య బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో మహేష్ ఆచంట(Mahesh Achanta) ఒకరు. ఈ షోలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు మహేష్. దీంతో రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో నటించే చాన్స్ వచ్చింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందుతున్నారు.

ఇదిలా ఉంటే.. మహేష్ తాజాగా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో తన భార్య అండ్ పాపతో దిగిన క్యూట్ ఫొటోస్ షేర్ చేశాడు. అయితే ఈ పిక్స్‌లో మహేష్ భార్య కడుపుతో ఉండటం విశేషం. దీంతో అతను మరోసారి తండ్రి కాబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక ఈ ఫొటోస్‌కి ‘ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story