- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: జల్సా సినిమా చూసేందుకు వచ్చిన మహేశ్ అభిమానిపై దాడి
పవన్ కల్యాణ్ జల్సా సినిమా 4కే రీసెంట్ గా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహేశ్ బాబు అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ జల్సా సినిమా 4కే రీసెంట్ గా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహేశ్ బాబు అభిమానిపై పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నువ్వు ఏ హీరో అభిమాని అంటూ దాడికి పాల్పడ్డారు. జై కల్యాణ్ బాబు అను.. నువ్వు ఏ హీరో అభిమానివి.. మహేశ్ బాబు మబ్బు స్టార్ అను అంటూ దాడి చేశారు. థియేటర్‌లో అందరి ముందే పవన్ అభిమానులు ఇలా రెచ్చిపోవడంతో ప్రేక్షకులు భయపడిపోయారు.
వాళ్లు చెప్పినట్టు చేసినా వినకుండా దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంకా తేలలేదు కానీ సోలష్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ హీరో అభిమాని అయినా సినిమా చూసేందుకు వస్తే దాడి చేస్తా అంటూ మండిపడుతున్నారు. హీరోలు కలిసి ఉంటే ఇలా దాడులు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. VIDEO






