ఫైనల్లీ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు చెల్లెలు.. కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో..(పోస్ట్)

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఫైనల్లీ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు చెల్లెలు.. కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో..(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టినప్పటి నుంచి మాట వినికిడి శక్తి లేకపోయినప్పటికీ నటనపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అలా తెలుగులో ‘నేనింతే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత కింగ్(King), శంభో శివ శంభో(Shambho Shiva Shambho), ఢమరుకం(Damarukam), దమ్ము (dammu), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu), ది ఫ్యామిలీ స్టార్ (The Family Star)వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అలాగే తన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంతో పాటు అవార్డులు కూడా తీసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అభినయ వివాహ బంధం లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌, జూబ్లీ హిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అభినయ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మ్యారేజ్ ఫొటోలు, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న పిక్, బిందెలో రింగ్ వేసి ఆడుకుంటున్న పిక్ షేర్ చేసింది. ఇక వాటికి ‘ఫైనల్‌గా ఒకటయ్యాము.. ఏప్రిల్ 16,2025లో’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్‌తో పాటు చాలా చూటముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story