SSMB-29: షూటింగ్ సెట్ నుంచి మహేశ్ బాబు లుక్ లీక్.. వామ్మో ఇలా తయారు చేశావేంటి రాజమౌళి అంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)

by Chukka Sudharani |

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘SSMB-29’.

SSMB-29: షూటింగ్ సెట్ నుంచి మహేశ్ బాబు లుక్ లీక్.. వామ్మో ఇలా తయారు చేశావేంటి రాజమౌళి అంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘SSMB-29’. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులల్లో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో ఇందులో నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మహేశ్ బాబుకు సంబంధించిన హాఫ్ లుక్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ షూటింగ్‌లో వేగం పెంచింది చిత్ర బృందం.

ఈ క్రమంలోనే SSMB-29 చిత్రీకరణ ప్రస్తుతం కెన్యాలో జరుపుకుంటున్నారు చిత్ర బృందం. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాది ఇటీవల ట్విట్టర్ వేదికగా తెలుపుతూ పలు ఫొటోలు షేర్ చేశారు. అయితే.. తాజాగా షూటింగ్ సెట్ నుంచి మహేశ్ బాబు లుక్ ఒకటి లీక్ అయింది. మంచి ఎండలో కొండల మధ్య ఈ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. మహేశ్ బాబు లుక్ చూపి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘ఆ హెయిర్ స్టైల్ ఏంటీ అలా ఉంది.. మా అన్న లుక్‌ను ఇలా తయారు చేశావేంటి డైరెక్టర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఫైర్.. బ్లాక్ బస్టర్ లోడింగ్’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. లింక్


Next Story