రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర ట్వీట్

by Mallepaka Hamsa |

హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1998లో ‘దిల్ సే’ చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ‘సోల్జర్’ లోనూ నటించి మెప్పించింది. ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’ (Raja Kumarudu)సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరో వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరా ’(Premante Idera) మూవీలో తన, అందం, నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. కానీ ఆ తర్వాత అమ్మడుకు ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. హిందీ, తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

కానీ గత కొద్ది కాలంగా ప్రీతి జింటా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె ప్రతి విషయంపై స్పందిస్తూ సెన్సేషనల్ పోస్టులతో సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ గురించి ప్రీతి జింటా దారుణమైన పోస్టులు పెట్టి కొంతమంది నాయకులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రీతి జింటా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. జవాన్ల కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా నా దృష్టిలో జవానువే. నీ ప్రతిభకు హ్యాట్సాఫ్.

రాజకీయాల్లో చేరాలనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని ఓ అభిమాని పోస్ట్ పెట్టగా.. దీనిపై ప్రీతి జింటా స్పందిస్తూ.. ‘‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. గతంలో నాకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్, రాజసభ సీటు ఆఫర్ చేశాయి. నేను మర్యాదపూర్వకంగా వాటిని తిరస్కరించాను. ఎందుకంటే నాకు ఈ రంగంగపై ఆసక్తి లేదు. నన్ను సోల్జర్ అని పిలవడం తప్పు కాదు.. నేను సైనికుడి కుమార్తెను, సైనికుడి సోదరిని కూడా. మేము ఉత్తర భారతీయులం, దక్షిణ భారతీయులం, బెంగాలీలమో కాదు.. మేము భారతీయులం. దేశభక్తి జాతీయగర్వం మా రక్తంలోనే ఉంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీతి జింటా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story