- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుబేర మూవీకి మహేశ్ బాబు విషెస్.. స్పందించిన ధనుష్, నాగార్జున
శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ కాంబినేషన్‌లో వస్తోన్న కుబేర మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ కాంబినేషన్‌లో వస్తోన్న కుబేర మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. మహేశ్ ట్వీట్‌కు నాగార్జున, ధనుష్ ఇద్దరూ స్పందించారు. ‘థాంక్యూ సో మచ్.. మీ విషెస్ మా చిత్రాన్ని మరింత స్పెషల్ చేశాయి. కోట్లాది మందికి చేరువ చేశాయి’ అని ఇద్దరు కృతజ్ఞతలు చెబుతూ రీట్వీట్స్ పెట్టారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటించింది. ఇదిలా ఉంటే.. ‘కుబేర’ సినిమాకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరను రూ.75 (జీఎస్టీ అదనం) పెంచుకునేలా వీలు కల్పించారు. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ట్వీట్






