Varanasi : శ్రీ‌రాముడిగా- రుద్రుడిగా మ‌హేష్ డ‌బుల్ రోల్‌?

by velandi.Saikiran |   (  Updated:2025-11-16 09:22:27  IST  )

మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సి

Varanasi : శ్రీ‌రాముడిగా- రుద్రుడిగా మ‌హేష్ డ‌బుల్ రోల్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి, ఈ సినిమా టైటిల్ టీజర్ ను వదిలారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కథ రామాయణం చుట్టే తిరుగుతుందట. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో శ్రీరాముడిగా అదే సమయంలో శివుడిగా ప్రిన్స్ మహేష్ బాబు కనిపిస్తాడని ఎస్ఎస్ రాజమౌళి హింట్ ఇచ్చారు.

ఈ రెండు పాత్రల్లో మహేష్ బాబును చూసుకోవచ్చని తెలిపారు. ఈ సినిమా మొద‌లెట్టేట‌ప్పుడు కూడా రామాయ‌ణంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం తీస్తున్నాన‌ని అస్స‌లు అనుకోలేదని వ్యాఖ్యానించారు జ‌క్క‌న్న‌. మ‌హేష్ కృష్ణుడిగా బాగుంటాడని వివ‌రించారు. కానీ రాముడి లాంటి ప్ర‌శాంత‌మైన పాత్ర‌కు మ‌హేష్ సూట‌వుతాడా ? లేదా ? అనుకుంటూనే ఫొటో షూట్ చేశామ‌న్నారు. కానీ అద్భుతంగా ఉంద‌న్నాడు. ఇప్ప‌టికి 60 రోజులు షూట్ చేశాం. ప్ర‌తీ రోజూ.. ఒక ఛాలెంజ్ అంటూ . ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి పేర్కొన్నారు.

READ MORE ....

Mahesh Babu: ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే..ఇక ముందు జాత‌రే

Next Story