- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేనల్లుడి నిశ్చితార్థంకు మహేష్ బాబు డుమ్మా.. చర్చనీయాంశంగా మారిన నమ్రత పోస్ట్
ఈ యంగ్ బిజినెస్‌మెన్ ఒక విదేశీ అమ్మాయితో ప్రేమలో పడి, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. సిద్ధార్థ్ గల్లా, కొరియా దేశానికి చెందిన 'హయిన్' అనే అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మేనల్లుడు, గల్లా జయదేవ్-పద్మావతి దంపతుల చిన్న కుమారుడైన సిద్ధార్థ్ గల్లా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. సిద్ధార్థ్ అన్నయ్య అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తూ, తన తదుపరి చిత్రం ‘వీసా’ విడుదలకు సిద్ధం చేసుకుంటున్నారు. తమ్ముడు సిద్ధార్థ్ మాత్రం సినిమాల్లోకి రాకుండా కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. అయితే, ఈ యంగ్ బిజినెస్‌మెన్ ఒక విదేశీ అమ్మాయితో ప్రేమలో పడి, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. సిద్ధార్థ్ గల్లా, కొరియా దేశానికి చెందిన 'హయిన్' అనే అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడంతో, తాజాగా వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ ఫొటోల్లో నమ్రత, సితారతో పాటు ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులంతా సందడి చేస్తూ కనిపించారు. అయితే ఈ వేడుకలో మహేష్ బాబు ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఈ వేడుకకు రాలేకపోయారని సమాచారం. సూపర్ స్టార్ ఈ ఫంక్షన్‌కు డుమ్మా కొట్టినప్పటికీ, నమ్రత ఫ్యామిలీ తరఫున దగ్గరుండి అంతా చూసుకున్నారు.మహేష్ బాబు మేనల్లుడు ఒక కొరియన్ అమ్మాయిని పెళ్లాడబోతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ దేశాంతర వివాహం గురించి తెలిసిన నెటిజన్లు, అసలు ఈ జంటకు ప్రేమ ఎలా పుట్టింది, ఎక్కడ పరిచయం అయ్యారంటూ గూగుల్‌లో తెగ ఆరా తీస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






