నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన మహేశ్ బాబు

by Malleboina Mahesh |

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన మహేశ్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను హీరో మహేశ్ బాబు విడుదల చేశారు. ఈ వృషకర్మ (VRUSHAKARMA) చిత్రానికి సంబంధించిన అప్డేట్‌లు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌లో చైతన్య పూర్తిగా కొత్త మేకోవర్‌తో కనిపించగా, సినిమా ట్రీట్‌మెంట్, టోన్, విజువల్ ప్రెజెంటేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది.

నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. కార్తీక్ డండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి పాత్ర కీల‌కంగా నిలవనుంది. సుకుమార్ రైటింగ్స్, SVCC నిర్మాణం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి అజనీష్ బి. థామస్ సంగీతం అందిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ, రఘుల్ ధేరియన్, శ్రీ నగేంద్ర, నవీన్ నూలి వంటి ప్రతిభావంతులైన టెక్నీషియన్లు కలిసి పనిచేస్తున్నారు. చైతన్య కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story