షాకింగ్.. జక్కన్న - మహేష్ బాబు మూవీ కొత్త చిక్కులు !

by velandi.Saikiran |

ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu )అలాగే రాజమౌళి ( Rajamouli) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే

షాకింగ్.. జక్కన్న - మహేష్ బాబు మూవీ కొత్త చిక్కులు !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu )అలాగే రాజమౌళి ( Rajamouli) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. కెన్యా కొన్ని భారీ సీన్స్ తీసేందుకు జక్కన్న ప్లాన్ చేశాడట. కెన్యాలో అడవిలో యాక్షన్ సీన్స్ తీసేందుకు భారీ ఏర్పాట్లు కూడా చేశారట. అయితే ఈ షూట్ మొత్తం రద్దు అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కెన్యాలో అంతర్గత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని ప్రాంతాలలో శాంతిభద్రతల పరిస్థితులు అనుకూలంగా లేవని సమాచారం అందుతోంది. ఇలాంటి పరిస్థితులలో అక్కడ షూటింగ్ చేస్తే ఖచ్చితంగా సమస్యలు వస్తాయని జక్కన్న బృందం ఆలోచన చేస్తోందట.

దీంతో తాత్కాలికంగా కెన్యా షూటింగ్ ను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 1000 కోట్లతో తీస్తున్నారని సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Next Story