#SSMB29: మహేష్ బాబు-రాజమౌళి మూవీ.. లీక్ అవ్వకుండా జక్కన్న ఏం చేశారో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-28 07:16:51  IST  )

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

#SSMB29: మహేష్ బాబు-రాజమౌళి మూవీ.. లీక్ అవ్వకుండా జక్కన్న ఏం చేశారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిని '#SSMB 29' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తులు వస్తున్నాయి. దాదాపు ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో ఇటీవలే హీరోయిన్‌ ప్రియాంక చోప్రా సైతం జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. కానీ, మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని మరింతగా పెంచేందుకు ఓపెనింగ్‌ డే పిక్స్‌ని షేర్‌ చేయడం, సినిమాకి సంబంధించిన విషయాలను షేర్‌ చేయడం జరుగుతుందని అంతా భావించారు. కానీ, మహేష్ బాబు సినిమా విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీక్రెట్‌ని రాజమౌళి మెయింటెన్‌ చేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల షూటింగ్‌లకు సంబంధించిన ఫొటోలు తరచూ లీక్ అవుతుండటమే అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయంలో మేకర్స్ గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

అందుకే, జక్కన్న ఓపెనింగ్‌ రోజు అల్యూమీనియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో కెమెరాలను సైతం అనుమతించలేదు. దాంతో ఓపెనింగ్ ఎలా జరిగింది, ఎవరు వచ్చారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు. అంతేకాదు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితోనూ నిర్మాతలు నాన్ డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్లను చేసుకున్నారు. అంటే సినిమాకు సంబంధించిన చిన్న విషయాన్ని సైతం మీడియాకు చెప్పడం, సోషల్‌ మీడియాలో షేర్ చేయడం, సెట్స్‌‌లో తీసుకన్న ఫోటోలను షేర్‌ చేయడం వంటివి చేస్తే భారీ మొత్తంలో ఫైన్‌ విధించడంతో పాటు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే హీరో మహేష్ బాబుతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదు.

ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌, బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాం నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిపైనా చిత్ర బృందం నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకట్రెండు షెడ్యూల్స్‌ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏమైనా పంచుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాలి.

Next Story