శరవేగంగా షూటింగ్.. వారణాసిని అప్పటికి కంప్లీట్ చేయనున్న మహేష్?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-27 21:30:54  IST  )

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో.. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్..

శరవేగంగా షూటింగ్.. వారణాసిని అప్పటికి కంప్లీట్ చేయనున్న మహేష్?
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో.. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా , భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమాపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిక్ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్టపడుతున్నారు. ది బెస్ట్ ఇచ్చేందుకు ట్రైనింగ్ తీసుకుంటూ.. షూటింగ్లో పాల్గొంటున్నారు.

వచ్చే ఏడాదిలో వారణాసిలో తన పోర్షన్స్ కంప్లీట్ చేసేయాలని మహేష్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2026 జూన్ నాటికి తన షూటింగ్ ను కంప్లీట్ చేయాలని ఫిక్సయ్యారని టాక్. మిగతా షూటింగ్ ను కూడా 2026 చివరిలోగా ఫినిష్ చేసి.. 2027 మిడ్ కి సినిమాను రిలీజ్ చేస్తారని ఒక బజ్ క్రియేట్ అయింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. సంచారి, రణతుంగ పాటలు వైరల్ అయ్యాయి. శ్రీ దుర్గఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ వారు భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story