- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ అలా మిస్ అయింది.. రేణు దేశాయ్
బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమలో పడింది.

దిశ, వెబ్‌డెస్క్: బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమలో పడింది. అలా కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఒక పాప బాబు ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ మరో పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నాడు.
ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అలా దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్‌గా బ్యాడ్ గర్ల్స్ మూవీలో ఓ కీల్ రోల్ ప్లే చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం మూవీ టీమ్ నన్ను సంప్రదించారు. ఆ పాత్ర చేయడానికి నేను ఆసక్తి చూపాను. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ కారణాలను ఇప్పుడు బయట పెట్టడం వల్ల అనవసర వివాదాలకు దారి తీస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రీజన్ ఏమై ఉంటుందబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు.






