ప్రిన్స్ మహేష్ బాబు గొప్ప మనిషి.. ఆ చిన్నారికి పునర్జన్మ !

by velandi.Saikiran |

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీల

ప్రిన్స్ మహేష్ బాబు గొప్ప మనిషి.. ఆ చిన్నారికి పునర్జన్మ !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో.. దూసుకు వెళ్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. సీనియర్ హీరో అయినప్పటికీ... యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు మహేష్ బాబు. హీరోగా రాణించడమే కాకుండా... ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మహేష్ బాబు. ప్రత్యేకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలామందికి సహాయం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో చిన్నారికి పునర్జన్మని ఇచ్చింది మహేష్ బాబు ఫౌండేషన్. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుదుమల్లికి చెందిన 9 సంవత్సరాల చిన్నారి పిల్లి వర్షితకు పునర్జన్మ ఇచ్చింది మహేష్ బాబు ఫౌండేషన్. విజయ్ కుమార్, మార్తమ్మ దంపతులకు జన్మించిన వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంద్రం ఏర్పడిందట. అయితే ఈ తరుణంలోనే మహేష్ బాబు ఫౌండేషన్ సభ్యులను సంప్రదించారు కుటుంబ సభ్యులు.

ఇక విజయవాడలోని ఆంధ్ర బ్రెయిన్, గుండె ఆసుపత్రిలో చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోరుకుంటోందని సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబుకు రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ సంఘటన బయటకు రావడంతో మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story