Athadu Re Release: థియేటర్ లో మెరిసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్ !

by velandi.Saikiran |   (  Updated:2025-08-10 08:21:50  IST  )

మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియోను థియేటర్ లో ప్లే చేశారు

Athadu Re Release: థియేటర్ లో మెరిసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్  !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 50 సంవత్సరాలు కావచ్చినా కూడా.. ప్రిన్స్ మహేష్ బాబుకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. యంగ్ హీరోలకు కూడా పోటీని ఇస్తున్నాడు మహేష్ బాబు. అయితే అలాంటి మహేష్ బాబు పుట్టినరోజు ( Mahesh Babu Birthday) వేడుకలు నిన్న చాలా గ్రాండ్ గా జరిగాయి.

ఈ సందర్భంగా అతడు సినిమా రి-రిలీజ్ కావడంతో.. థియేటర్ లో చాలా మంది ఫ్యాన్స్ కేకులు కట్ చేసి... సెలబ్రేషన్స్ చేశారు. అయితే మరి కొంత మంది.. రక్త దానాలు కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ సరికొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు సినిమా నడుస్తున్న నేపథ్యంలోనే... మహేష్ బాబు అలాగే రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇద్దరు కలిసి ఉన్న వీడియోను... థియేటర్ లో ప్లే చేశారు.

ఈ వీడియోలో ప్రిన్స్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియోను ప్రత్యేకంగా క్రియేట్ చేయించి మరి... థియేటర్ లో ప్లే చేశారు మహేష్ బాబు అభిమానులు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహేష్ బాబు అభిమానులు... అతడు సినిమాను రోహిత్ శర్మ కూడా చూశాడని అంటున్నారు.

Twitter Link

Next Story