- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మహేంద్రగిరి వారాహి' రిలీజ్ డేట్ లాక్?
'మహేంద్రగిరి వారాహి' చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరికొద్ది రోజుల్లోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






