- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahavatar Narasimha: ఫైనల్‌గా రాబోతున్న ‘మహావతార్ నరసింహ’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వైరల్
హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘మహావతార్ నరసింహ’.

దిశ, సినిమా: హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘మహావతార్ నరసింహ’. ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన ఈ విజువల్ వండర్ జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వస్తుండగా.. ఫైనల్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
మహావతార్ నరసింహ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 19న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా.. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా.. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మహావతార్ ప్రాంచైజీలో.. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి. లింక్






