ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ.. యానిమేషన్ సినిమా చరిత్రలోనే తొలిసారి

by Ramesh Naini |   (  Updated:2025-11-25 11:05:13  IST  )

భారత యానిమేషన్ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం ఆస్కార్ 2026 బరిలో నిలిచింది.

ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ.. యానిమేషన్ సినిమా చరిత్రలోనే తొలిసారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత యానిమేషన్ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. 2026 ఆస్కార్ పోటీల్లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో సినిమా ఎంపిక అయింది. పలు దేశాల నుంచి 35 చిత్రాలు ఎంపికవ్వగా.. వాటిల్లో ఒకటిగా మహావతార్ నరసింహ పోటీలో నిలిచింది. భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ సినిమా ఇదే కావడం విశేషం. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్‌ మైథాలజీ ఫిల్మ్ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసిన ఈ మైథాలజీ సినిమాను దాదాపు రూ. 40 కోట్లతో రూపొందించగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.

శ్రీ మ‌హావిష్ణువు, న‌ర‌సింహావ‌తారం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆదరించారు. అయితే ఎంతో ఆదరణ పొందిన ఈ సినిమా 2026 ఆస్కార్ పోటీలో నిలవడం సినిమా లవర్స్ ఉప్పొంగి పోతున్నారు. ఇక, 2026 ఆస్కార్ పోటీలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పలు దేశాల నుంచి వచ్చిన 35 సినిమాల్లో 'మహావతార్ నరసింహ' కూడా ఒకటిగా నిలిచింది. 98వ అకాడమీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రకటిస్తారు. మార్చి 15న ఆస్కార్‌ అవార్డుల వేడుకలు నిర్వహిస్తారు.

Next Story