రిలీజ్‌కు సిద్ధమైన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’.

రిలీజ్‌కు సిద్ధమైన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’. హర్ష రోషన్(Harsha Roshan), కార్తికేయ దేవ్(Kartikeya Dev), స్టీవెన్ మధు, శాన్వీ మేఘన(Shanvi Meghna), నిహాల్ కోదాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రవాహిని, ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి(Rahul Reddy), లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘న్యూ ఏజ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్‌, కమ్‌ ఆటో ఎన్నో మ్యాజికల్‌ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంటుంది. యువతరం నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story