‘మ్యాజిక్’ హిట్.. మరాఠీ ప్రేక్షకులదే బాధ్యత..

by Sujitha Rachapalli |

టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న

‘మ్యాజిక్’ హిట్.. మరాఠీ ప్రేక్షకులదే బాధ్యత..
X

దిశ, సినిమా : టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో..

మెహర్ రమేష్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారితో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఇప్పుడు ‘మ్యాజిక్’ మూవీని నిర్మించారు. ట్రైలర్ చూశాను. నాకెంతో గ్రిప్పింగ్‌గా అనిపించింది. పూరి గారి చిత్రాల్లో రాజ్ నటించాడు. ఇప్పుడు ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ చిత్రం కోసం సపోర్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మరాఠీ ప్రేక్షకులకు కూడా స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడి వారంతా ‘మ్యాజిక్’ మూవీని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా మాట్లాడుతూ .. ‘‘మ్యాజిక్’ ఎలా ఉండబోతోందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. రాజు సత్యం గారు ఈ మూవీని మరాఠీలో నిర్మించి ఓ గొప్ప అడుగు ముందుకు వేశారు. తెలుగు సబ్ టైటిల్స్‌‌తో ఈ చిత్రం రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు’ అని అన్నారు.

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘మ్యాజిక్’ నిర్మాత రాజు సత్యంకి ఆల్ ది బెస్ట్. ఇండియన్ సినిమాల్లో మరాఠీ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడి నుంచి అద్భుతమైన ఆర్టిస్టులు బయటకు వచ్చారు. అలాంటి ఇండస్ట్రీ నుంచి నేరుగా ‘మ్యాజిక్’ సినిమా రాబోతోంది. రిలీజ్‌కు ముందే ప్రపంచ వ్యాప్తంగా 9 అంతర్జాతీయ అవార్డుల్ని దక్కించుకుంది. ఈ మూవీకి జెన్యూన్‌గానే హిందీ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది. ఇదొక మంచి చిత్రం. కేవలం మరాఠీలోనే కాకుండా అన్ని భాషల్లోకి ఈ చిత్రం వెళ్లాలి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కాబోతోంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Next Story