DHRUV NAKSHATRAM: పదేళ్ల క్రితం తీసిన సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

by Ajay Maddhiboyina |

త‌మిళ‌స్టార్ విక్ర‌మ్ హీరోగా న‌టించిన ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమా విడుద‌ల‌కు మ‌ద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 2016లో ప్రారంభించి 2017లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేయ‌గా ఆర్థిక ఇబ్బందులు, న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది.

DHRUV NAKSHATRAM: పదేళ్ల క్రితం తీసిన సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళ‌స్టార్ విక్ర‌మ్ హీరోగా న‌టించిన ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమా విడుద‌ల‌కు మ‌ద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 2016లో ప్రారంభించి 2017లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేయ‌గా ఆర్థిక ఇబ్బందులు, న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది. అప్ప‌టి నుండి కోర్టుల చుట్టూ తిరుగున్న ఈ చిత్రానికి ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. సినిమాను విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని మ‌ద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను స్పై యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించారు. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన నాటి నుండే చిత్రయూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది.

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే గౌత‌మ్ మీన‌న్ శింబు హీరోగా ఓ సినిమా తెర‌కెక్కించేందుకు అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ ఆ సినిమా ప‌ట్ట‌లేక్క‌లేదు. ఈ నేప‌థ్యంలోనే గౌత‌మ్ మీనన్ కు అడ్వాన్స్ ఇచ్చిన బ్యాన‌ర్ కోర్టును ఆశ్రయించింది. ఇది జ‌రిగిన త‌ర‌వాత కూడా సినిమాకు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఎన్నిఅంతరాయాలు ఎదురైనా డైరెక్టర్ సినిమాను పూర్తి చేసినప్పటికీ విడుదల వాయిదా పడుతూనే ఉంది. పలుమార్లు విడుదల తేదీలు కూడా ప్రకటించారు కానీ రిలీజ్ కాలేదు. దీంతో మూవీలవర్స్ సినిమా విడుదల కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఇక కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో వచ్చే నెల 22న సినిమా విడుదలకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Next Story