Madhavan: ఆ విషయం నా మనసు ముక్కలు చేసింది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2024-11-27 15:39:19  IST  )

హీరో మాధవన్ (Madhavan), హీరోయిన్ దియా మీర్జా (Dia Mirza) జంటగా నటించిన ‘రెహ్నా హై తేరే దిల్ మే’ (Rehna Hai Tere Dil Mein) చిత్రం విడుదలై ఈ ఏడాదితో 25 ఏళ్లు అవుతోంది.

Madhavan: ఆ విషయం నా మనసు ముక్కలు చేసింది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరో మాధవన్ (Madhavan), హీరోయిన్ దియా మీర్జా (Dia Mirza) జంటగా నటించిన ‘రెహ్నా హై తేరే దిల్ మే’ (Rehna Hai Tere Dil Mein) చిత్రం విడుదలై ఈ ఏడాదితో 25 ఏళ్లు అవుతోంది. వాసుదేవ్ మేనన్ (Vasudev Menon) తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో ఊహించినంత ఫలితం దక్కించుకోలేక పోయింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో మాధవన్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాము. మూవీ హిట్ కావాలని దేవాలయాలను కూడా సందర్శించాము. కానీ ఫలితం దక్కలేదు. సినిమా ఫ్లాప్ కావడంతో నా మనసు ముక్కలైంది. చాలా బాధపడ్డా. అయితే.. ఇటీవల ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశాము. ఒరిజినల్ కలెక్షన్స్ (Original Collections) కంటే రీరిలీజ్ (Rerelease)లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 25 ఏళ్ల తర్వాత మా సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story