అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది.. హీరో మాధవన్ కామెంట్స్

by Chukka Sudharani |

ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మాధవన్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.

అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది.. హీరో మాధవన్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మాధవన్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ఓటీటీ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మాధవన్ నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘లెగసీ’. నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతుండగా.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మాధవన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘లెగసీ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్‌‌స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో నేను కూడా భాగం కావడం సరికొత్త అనుభవం. ఈ సిరీస్ రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

Next Story