- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాధవన్, కంగనా కాంబోలో మూవీ.. టైటిల్ కూడా ఫిక్స్
బాలీవుడ్‌లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘ఎమర్జెన్సీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగన.. తాజాగా మరో సినిమా అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్‌గా ‘ఆప్ జైసా కోయి’తో ఆకట్టుకున్న ఆర్. మాధవన్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు సిద్ధం మయ్యాడు. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహింస్తుండగా.. ఇందులో ఫీమేల్ లీడ్‌లో కంగన నటింస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కాగా.. రీసెంట్‌గా పార్టీ కూడా చేస్తున్నారట చిత్ర బృందం. ఈ మూవీకి ‘సర్కిల్’ అనే టైటిల్ ఖాయం చేసినట్లు తెలుస్తుండగా.. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.






