- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka Arul Mohan: డైరెక్ట్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన 'మేడ్ ఇన్ కొరియా'
ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రం నేరుగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే చిత్రంతో ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ పలు తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలు దక్కలేదు. దాంతో ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టడం మొదలుపెట్టింది.
ఈ నటికి కోలీవుడ్లో మాత్రం మంచి విజయాలు దక్కాయి. అక్కడ మంచి హిట్స్ దక్కడంతో తమిళ ఇండస్ట్రీలో మంచి దశకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'ఓజీ' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో తెలుగులో ఈమెకు మళ్లీ మంచి గుర్తింపు వచ్చింది.
ఓజీ సినిమా విడుదల అయిన తర్వాత ఈమె వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వెళ్ళలేదు, ఆచితూచి సినిమాలను ఓకే చేస్తుంది. అందులో భాగంగా ప్రియాంక తాజాగా మేడ్ ఇన్ కొరియా అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వారు నేరుగా తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మన ఇండియన్ సినిమా లవర్స్ కొరియన్ చిత్రాలను కూడా బాగానే ఇష్టపడుతుంటారు, అలాంటి వారికి ఈ మూవీ నచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కొరియన్ సినిమాతో ప్రియాంక ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






