- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MadhaGajaRaja: వెంకటేష్ చేతుల మీదుగా ‘మదగజరాజ’ ట్రైలర్ లాంచ్..
తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటించిన తాజా చిత్రం ‘మదగజరాజా’ (MadhaGajaRaja).

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటించిన తాజా చిత్రం ‘మదగజరాజా’ (MadhaGajaRaja). 12ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ మూవీ లేటెస్ట్‌గా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న రిలీజై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. ఆర్య, సోనూసూద్, సంతానం కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇంతమంది స్టార్స్ నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలవుతున్న క్రమంలోనే నిర్మాత సంతానం అడ్డుకున్నారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించడంతో రిలీజ్ వాయిదా పడింది.
ఆ తర్వాత పలు చిక్కుల వల్ల 2012 నుంచి విడుదలకు బ్రేకులు పడుతూ వచ్చింది. ఇక అన్నిటిని ఎదుర్కొని తాజాగా ఈ సినిమా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ (Super hit) అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ (Trailer) అప్‌డేట్ కూడా ఇచ్చారు. ‘ప్రియమైన ఎంటర్‌టైనర్ వెంకీమామ చేతుల మీదుగా ‘మదగజరాజా’ సినిమా యొక్క ఉల్లాసమైన తెలుగు ట్రైలర్ రేపు లాంచ్ చేయబడుతుంది. ఈ సినిమా జనవరి 31న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
The Beloved Entertainer Victory @VenkyMama will unleash the hilarious madness of #MadhaGajaRaja 🤩
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 24, 2025
The Telugu Trailer will be launched Tomorrow❤️🔥
Grand Release In Telugu on January 31st 💥@VishalKOfficial @iamsanthanam#SundarC @yoursanjali @varusarath5 @vijayantony… pic.twitter.com/nDpsxpBmMq






