- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మ్యాడ్ స్క్వేర్" ట్రైలర్ రిలీజ్..ఇది జస్ట్ శాంపిల్ .. థియేటర్ లో ఇక రచ్చే
మ్యాడ్ స్క్వేర్ సినిమా ( Mad Square ) ట్రైలర్ వచ్చేసింది. కాసేపటి క్రితమే.. ఈ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. జూన

దిశ, వెబ్ డెస్క్: మ్యాడ్ స్క్వేర్ సినిమా ( Mad Square ) ట్రైలర్ వచ్చేసింది. కాసేపటి క్రితమే.. ఈ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ( NTR ) బావ మరిది నార్నె నితిన్ ( Narne Nithiin ), సంగీత శోభన్ ( Sangeeth Shobhan) కీలక పాత్రలో పోషించిన మ్యాడ్ సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా... ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో... వరుసగా అప్డేట్లను వదులుతోంది చిత్ర బృందం.
ఈ తరుణంలోనే తాజాగా మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ ( Mad SquareTrailer) రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో కామెడీ చాలా అద్భుతంగా ఉంది. మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టారు. దీంతో చిన్న చిన్న సన్నివేశాలే.. నవ్వులు పూయించాయి. అదే సమయంలో డైలాగులు బాగానే పేలాయి. ఇక బిజిఎం ( BGM) ఐతే సినిమాకు హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. అటు లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. సినిమా రిలీజ్ కంటే ముందే ట్రైలర్ అంచనాలను భారీగా పెంచింది. కాగా ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమా ( Mad Square ) ఈ నెల 28వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉండగా... గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా బంపర్ హిట్ అందుకోవడంతో... ఇప్పుడు వచ్చే సీక్వెల్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.






