- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మా ఇంటి బంగారం' జోరు.. సమంత ఖాతాలో సాలిడ్ రికార్డు
'మా ఇంటి బంగారం' ఫిమేల్ లీడ్ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం'. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు సాధించి ఇప్పటికే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన ఫిమేల్ లీడ్ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'మా ఇంటి బంగారం' నిలిచినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏ లేడీ ఓరియంటెడ్ తెలుగు సినిమా నమోదు చేయని వసూళ్లను ఈ చిత్రం సాధించిందని సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దాంతో మరో కొన్ని రోజుల పాటు ఇదే జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను నమోదు చేస్తుందో అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించారు.






