ఓటీటీలోకి రాబోతున్న ‘మా ఇంటి బంగారం’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Mallepaka Hamsa |

ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు.

ఓటీటీలోకి రాబోతున్న ‘మా ఇంటి బంగారం’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించి, ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టాలెంటెడ్ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘‘ఒక్కొక్కడిని కొడతాం చూడు ప్రేమతో అబ్బా’’ అనే ఈ మాస్ అండ్ ఫన్నీ డైలాగ్ నెటిజన్లను, సమంత అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Next Story