OTT: ఓటీటీలోకి లస్ట్, రొమాన్స్ అండ్ బోల్డ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

by Chukka Sudharani |

సోనియా అగర్వాల్ (Sonia Agarwal), శ్రీకాంత్ (Srikanth) జంటగా నటించిన తమిళ మూవీ ‘ష్’ (sshhh).

OTT: ఓటీటీలోకి లస్ట్, రొమాన్స్ అండ్ బోల్డ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
X

దిశ, సినిమా: సోనియా అగర్వాల్ (Sonia Agarwal), శ్రీకాంత్ (Srikanth) జంటగా నటించిన తమిళ మూవీ ‘ష్’ (sshhh). పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో లస్ట్, రొమాన్స్ అండ్ బోల్డ్ తదితర అంశాలను చూపించారు. ఈ సినిమా నాలుగు కథల సమహారం కాగా.. స్కూల్ ఏజ్‌(School Age)లో సెక్స్ ఎడ్యుకేషన్ (Sex Education), పెళ్లికి ముందు, మిడిల్ ఏజ్ రొమాన్స్ మొదలగు స్టోరీస్‌ను ముఖ్య అంశాలుగా తీసుని ‘ష్’ను రూపొందించారు. ఈ చిత్రం గతేడాది తమిళ్‌లో రిలీజ్ కాగా.. తమిళ వెర్షన్ ఆహా (aha), అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌(Amazon Prime Videos)ల స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగు వెర్షపై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అలాగే ‘ప్రతి అరుపు వినబడదు.. ప్రతి రహస్యం దాగి ఉండదు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story