Lucky Baskhar : నెట్ ఫ్లిక్స్ లో కొత్త రికార్డు సాధించిన  'లక్కీ భాస్కర్' మూవీ

by Phanindra |   (  Updated:2025-02-28 16:00:35  IST  )

బ్యాంకింగ్ వ్యవస్థ, అవినీతి అంశాలతో ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Lucky Baskhar : నెట్ ఫ్లిక్స్ లో కొత్త రికార్డు సాధించిన  లక్కీ భాస్కర్ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి ( Venky Atluri ) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar). రిలీజ్ అయి 4 నెలలు దాటినా ఇప్పటికి ఈ చిత్రం పై క్రేజ్ కొంచం కూడా తగ్గలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ, అవినీతి అంశాలతో ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ, టీవీ ఇలా వెండితెర దగ్గర నుంచి సోషల్ మీడియా అన్ని ప్లాట్ ప్లాట్ ఫార్మ్స్ పై రికార్డ్ వ్యూస్ ను సాధించింది. ఇటీవలే టీవీలో ప్రసారం కాగా .. 8.4 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఇంత వరకు ఏ తెలుగు హీరో మూవీకి ఈ రేంజ్లో రేటింగ్ రాలేదు. మొదటి హీరోగా దుల్కర్ రికార్డు క్రియోట్ చేశాడు.

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఇప్పటికి ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ ( Tollywood ) , హాలీవుడ్ ( Hollywood ) , బాలీవుడ్ ( Bollywood ) నుంచి కొన్ని వందల సినిమాలు మన ముందుకొచ్చాయి. అయితే, " లక్కీ భాస్కర్ " చిత్రానికి వచ్చిన క్రేజ్ ఏ సినిమాకి రాలేదు. ఈ మూవీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. థియేటర్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేశాయి.

అయితే, తాజాగా మరో కొత్త రికార్డును సాధించింది 'లక్కీ భాస్కర్'. నెట్ ఫ్లిక్స్ (Netflix) ప్లాట్ ఫార్మ్ పై 13 వారాల పాటు ట్రెండింగ్ ఉన్న తొలి సౌత్ ఇండియన్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక, ఇదే విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ పోస్టర్ ను షేర్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకం పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దుల్కర్ కు జోడిగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) కథానాయికగా గా నటించింది.

Next Story