Lover's Day Special: లవర్స్ డే స్పెషల్.. రిలీజ్ అండ్ రీ-రిలీజ్ సినిమాలు ఇవే

by Chukka Sudharani |

ప్రేమికుల రోజు సందర్భంగా (Lover's Day Special) కొత్త సినిమాలు అలాగే గతంలో రిలీజై మంచి హిట్ అందుకున్న లవ్ మూవీస్ (Love Movies) రీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Lovers Day Special: లవర్స్ డే స్పెషల్.. రిలీజ్ అండ్ రీ-రిలీజ్ సినిమాలు ఇవే
X

దిశ, సినిమా : ప్రేమికుల రోజు సందర్భంగా (Lover's Day Special) కొత్త సినిమాలు అలాగే గతంలో రిలీజై మంచి హిట్ అందుకున్న లవ్ మూవీస్ (Love Movies) రీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే?

లైలా (Laila) : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ నారాయణ్ కాంబోలో ‘లైలా’ తెరకెక్కిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇందులో విశ్వక్ డ్యూయల్ రోల్‌లో అలరించనున్నాడు. ఈ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో వినోదాన్ని అందించేందుకు సిద్ధం అయ్యాడు ఈ హీరో.

బ్రహ్మా ఆనందం (Brahmanandam) : స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వస్తున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. ఈ మూవీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో యంగ్ డైరెక్టర్ Rvs నిఖిల్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఈ రోజు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఛావా (chaava) : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

తల (Thala) : అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘తల’. అంకిత నస్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తల’ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇట్స్ కాంప్లికేటెడ్ (It's complicated) : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిస్ లీల’ 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలై మంచి హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే కొత్త టైటిల్‌తో ఈరోజు థియేటర్లలోకి వస్తుంది ఈ చిత్రం.

రీ-రిలీజ్ సినిమాలు:

ఆరెంజ్ (Orange) : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’. ఈ సినిమా వాలెంటైన్ డే స్పెషల్‌గా థియేటర్లలో ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2010లో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇటీవల ‘ఆరెంజ్’ చిత్రం రీరిలీజ్ కాగా.. సూపర్ హిట్ సక్సెస్ అందుకుని భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధం అయింది.

ఎటో వెళ్ళిపోయింది మనసు (Yeto Vellipoyindhi Manasu): నేచురల్ స్టార్ నాని, క్యూట్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

సూర్య S/o కృష్ణన్ (Surya S/o Krishnan): తమిళ స్టార్ సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘సూర్య S/o కృష్ణన్’. సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చెయ్యగా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఇప్పుడు మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.

Next Story