సైన్స్ ఫిక్షన్ & రొమాంటిక్ కామెడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ

by Chukka Sudharani |

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.

సైన్స్ ఫిక్షన్ & రొమాంటిక్ కామెడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
X

దిశ, సినిమా: ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. సెవన్ స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ బ్యానర్స్‌పై విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంది కృతి శెట్టి.

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీ కలగలిపిన చిత్రం. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ జానర్‌లో సినిమాను తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు నేపథ్యంలో రూపొందబోతోన్న ఈ మూవీ 2040 సంవత్సరాన్ని చూపిస్తుంది. ఇందులో ప్రతి సీన్స్ చాలా ఇన్నోవేటివ్‌గా ఫ్రెస్‌గా ఉంటాయి. ప్రజెంట్ అండ్ పాస్ట్‌లో సెట్ చేయబడిన కథలు వాస్తవ ప్రపంచ సూచనలపై ఆధారపడి ఉంటాయి.. కానీ ఇది భవిష్యత్తును ఊహించుకుని తీసిన కథ కాబట్టి పూర్తిగా క్రియేటివ్‌గా ఉంటాయి.. కచ్చితంగా ఈ మూవీకి అందరూ కనెక్ట్ అవుతారు’ అని తెలిపింది. కృతి శెట్టి కామెంట్స్ వైరల్ కావడంతో సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.

Next Story