- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
24 ఏళ్ల వయసులో ప్రేమ, కానీ మూడేళ్లకే బ్రేకప్ అయింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల జోరులో ఉన్న మూవీ టీమ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం కలుగుతుంది. దాన్ని మనం సీరియస్ రిలేషన్ షిప్ అనుకుంటాం.. నాకు కూడా ఓ స్టోరీ ఉంది. నేను 24 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత మూడున్నర ఇళ్లకే నా లవ్ బ్రేక్ అయ్యింది.
24 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం ఆ తర్వాత బ్రేకప్ జరగడంతో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత దాని నుంచి బయట పడ్డాను. కెరీర్ మీద ఫోకస్ చేశా, ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. జీవితంలో కొన్ని కొన్ని తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి. 27 ఏళ్ళ వయసులోనూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటేనే మనం దాని నుంచి త్వరగా బయటకు రాగలము’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.