'పెద్ది' కోసం ఎదురు చూస్తున్నాను.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Pulgam srinivas |

ధనుష్ మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

పెద్ది కోసం ఎదురు చూస్తున్నాను.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుల్లో ఒకరైన ధనుష్ తాజాగా ‘కర’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. దీంతో ఈ మూవీ బృందం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ల నిమిత్తం నిన్న రాత్రి ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. “బుచ్చిబాబు గారు మీరు మా ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ‘పెద్ది’ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఇదే ఈవెంట్‌లో బుచ్చిబాబు సనా మాట్లాడుతూ.. “ధనుష్ గారి కోసమే నేను ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన ఎన్నో సినిమాలను నేను చూశాను. రెహమాన్ గారు కూడా ఆయన డెడికేషన్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఆయన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Next Story