- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.60 కోట్ల మోసం.. నటి శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు జారీ
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై (Raj Kundra) ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న వీరికి లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై (Raj Kundra) ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న వీరికి లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఒక వ్యాపారం విషయంలో జరిగిన ఒప్పందంలో ఈ జంట సదరు వ్యాపార వేత్తను మోసం చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) పేర్కొన్నారు. వీరు తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్నట్లుగా ట్రావెల్ హిస్టరీ ద్వారా తెలిసిందన్నారు. అందుకే కేసు విచారణ సమయంలో దేశం వదిలి పారిపోకుండా లుక్ అవుట్ సర్క్యులర్ (Look Out Circular) జారీ చేసినట్లు చెప్పారు.
ఆగస్టు 14వ తేదీ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై జుహు పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు నమోదైంది. రుణం కమ్ ఇన్వెస్ట్ మెంట్ ఒప్పందంలో ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. 2015-2023 మధ్య వ్యాపార విస్తరణ కోసమని వీరు డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు.






