Lokesh Kanagaraj: ‘స్టోన్‌బెంచ్-16’ టైటిల్ రివీల్ చేసిన లోకేష్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

యంగ్ హీరో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy), ఇలంగో రామ్(Ilango Ram) కాంబోలో ఓ మూవీ రాబోతుంది.

Lokesh Kanagaraj: ‘స్టోన్‌బెంచ్-16’ టైటిల్ రివీల్ చేసిన లోకేష్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: యంగ్ హీరో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy), ఇలంగో రామ్(Ilango Ram) కాంబోలో ఓ మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం స్టోన్‌బెంచ్ ఫిలిమ్స్(Stonebench Films), బ్రావేజ్ స్టూడియోస్(Bravez Studios) బ్యానర్స్ తెరకెక్కుతున్న 16వ ప్రాజెక్ట్ ఇదే. దీనిని కార్తికేయన్(Karthikeyan), హర్మాన్ బివేజ్, హిరణ్య పెరేరా(Hiranya Perera) నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో నిహారిక(Niharika), చాందిని హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్ రెడ్డి(Sunil Reddy), బాలా, వినోద్, అశోక్ నారాయణ్(Ashok Narayan) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా, సంక్రాంతి సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేయించారు. ఈ సినిమాకు ‘పెరుసు’(Perusu ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తెలుగులో పెద్ద పేరుతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టర్‌లో ఓ ముసలాయన బెడ్‌పై ఉండగా.. అందరూ పట్టుకుని జరుపుతున్నారు.

Next Story