‘ఖైదీ 2’ ఆగిపోలేదు.. డైరెక్టర్ క్లారిటీ

by Sujitha Rachapalli |

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరో కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖైదీ’ మూవీకి సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే లోకేష్, అల్లు అర్జున్‌ కాంబోలో కొత్త మూవీ ప్రకటన వచ్చింది.

‘ఖైదీ 2’ ఆగిపోలేదు.. డైరెక్టర్ క్లారిటీ
X

దిశ, సినిమా : డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరో కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖైదీ’ మూవీకి సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే లోకేష్, అల్లు అర్జున్‌ కాంబోలో కొత్త మూవీ ప్రకటన రావడంతో ‘ఖైదీ 2’ నుంచి లోకేష్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేష్ కనగరాజ్ స్పందించారు. భారీ పారితోషికం కోసం తాను ‘ఖైదీ 2’ నుంచి తప్పుకున్నాని, LCU ముగిసిపోయిందని వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. అల్లు అర్జున్ సార్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తప్పకుండా ‘ఖైదీ 2’ అని స్పష్టం చేశారు. #Kaithi2, #Vikram2, అలాగే #Rolex.. ఇవన్నీ తన కమిట్‌మెంట్స్ అని, వాటిని పూర్తిచేయకుండా ఎక్కడికీ వెళ్లనన్నారు. #LCU చాలా త్వరలోనే తిరిగి ఓపెన్ అవుతుందని, ‘#Benz’ కూడా LCUలో భాగమేనని తెలిపారు.

Next Story