అల్లు అర్జున్‌పై ఆ భారం తొలగించిన లోకేష్ కనగరాజ్

by Pulgam srinivas |

అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న సినిమా (LCU)'లో భాగం కాదని, పూర్తిగా కొత్త కథతో రూపొందనున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్‌పై ఆ భారం తొలగించిన లోకేష్ కనగరాజ్
X

దిశ, వెబ్‌ డెస్క్: తమిళ స్టార్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన పలు చిత్రాలు దేశవ్యాప్తంగా ఘన విజయాలు సాధించడంతో పాన్‌ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'ఖైదీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న లోకేష్, అదే సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కు శ్రీకారం చుట్టారు. అనంతరం 'విక్రమ్', 'లియో' చిత్రాలను కూడా ఈ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించారు. వీటిలో 'విక్రమ్' భారీ విజయాన్ని సొంతం చూసుకుంది. ఇటీవల ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన 'కూలీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ప్రస్తుతం లోకేష్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. అయితే ఈ చిత్రం కూడా LCUలో భాగమేనా? అనే చర్చలు అభిమానుల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్‌తో తెరకెక్కించే సినిమా LCUలో భాగంగా కాకుండా పూర్తిగా కొత్త కథతో రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత లోకేష్ మరోసారి LCUలో భాగమైన చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' చిత్రంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ఆ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story