స్టార్ హీరోలకు షాక్...లిటిల్ హార్ట్స్ మూవీ సరికొత్త రికార్డు !

by velandi.Saikiran |

లిటిల్ హార్ట్స్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో...

స్టార్ హీరోలకు షాక్...లిటిల్ హార్ట్స్ మూవీ సరికొత్త రికార్డు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బంపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మౌళి అలాగే శివాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య హసన్ నిర్మాతగా వ్యవహరించగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.

సెప్టెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ సినిమా... దసరా కానుకగా ఓటీటీలోకి కూడా వచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈటీవీ విన్‌లో... ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే లిటిల్ హార్ట్స్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో... అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ హవా ఇలాగే కొనసాగితే... బడా హీరోల సినిమాల రికార్డులు కూడా బద్దలు కొడుతుందని సీని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story