చాన్స్ వస్తే మహేశ్ బాబుతో అలాంటి సినిమా చేస్తా.. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-10-15 16:37:23  IST  )

‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తండ్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

చాన్స్ వస్తే మహేశ్ బాబుతో అలాంటి సినిమా చేస్తా..  లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తండ్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. మౌళి, శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో డైరెక్టర్‌గా సాయి మార్తాండ్ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. దీంతో ఈ డైరెక్టర్ నెక్ట్స్ ఎలాంటి మూవీస్ చెయ్య బోతున్నాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మార్తండ్ తనకు మహేశ్ బాబు‌తో సినిమా తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు. ‘నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో అభిమానం. ఏదో ఒక రోజు ఆయనతో సినిమా చేయడం నా కల. ఒకవేళ అవకాశం వస్తే.. మహేష్ బాబుతో పక్కా ప్రేమకథా చిత్రం తీయాలని ఉంది. అది కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా, కొత్త నేపథ్యం మీద సాగేలా చేయాలనుకుంటున్న’ అని తెలిపాడు. ప్రస్తుతం సాయి మార్తాండ్ రెండు కొత్త సినిమాలపై పని చేస్తున్నారు. వాటిలో ఒకటి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Read More..

అంతా అనుకున్నట్లు జరిగితే.. ‘ఫౌజీ’ అండ్ NTRNeel రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Next Story