The Kerala Story 2 : హైకోర్టులో ఊరట.. కేరళ స్టోరీ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-27 11:02:01  IST  )

కేరళ స్టోరీ-2 సినిమాకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా విడుదలపై స్టేను కేరళ హైకోర్టు తొలగించింది.

The Kerala Story 2 : హైకోర్టులో ఊరట.. కేరళ స్టోరీ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ స్టోరీ-2 సినిమా(Kerala Story-2 Movie)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా విడుదలపై స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. కాగా, సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారంటూ సెన్సార్ బోర్డుపై కోర్టు ఇటీవల మండిపడింది. సుదీర్ఘ విచారణ అనంతరం సినిమాపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా స్టే ఎత్తివేయడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలైంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలూ లేకుండా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఘన విజయాన్ని సాధించింది. రూ.20 కోట్లు పెట్టి తీస్తే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2’ తెరకెక్కింది. సీక్వెల్‌కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్త, అతిథి భాటియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు స్టే విధించడంతో ఆగిపోయింది. విడుదలపై త్వరలోనే చిత్రబృందం కొత్త తేదీని ప్రకటించనుంది.

Next Story