‘జననాయగన్’కు లైన్ క్లియర్..! సెన్సార్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 06:54:34  IST  )

ళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.

‘జననాయగన్’కు లైన్ క్లియర్..! సెన్సార్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్‌’ (Jananayagan) మూవీ విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు మూవీకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సీబీఎఫ్‌సీ (CBFC)కి మద్రాస్ హైకోర్టు (Madras High Court) సింగిల్ బెంచ్ ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా.. మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ముందుకు ఇస్తామని చెప్పిన యూఏ సర్టిఫికేట్‌ను తక్షణమే ఇచ్చేయాలని సీబీఎఫ్‌సీకి ధర్మాసనం మొట్టికాయలు వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో దళపతి విజయ్ సినిమాకు రంగం సిద్ధమైంది. జనవరి 14న మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ నిర్మాతలు ఏర్పాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

డివిజన్ బెంచ్‌కు సెన్సార్ బోర్డు..

మూవీకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సీబీఎఫ్‌సీ (CBFC)కి మద్రాస్ హైకోర్టు (Madras High Court) సింగిల్ బెంచ్ ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ మళ్లీ సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. కాసేపట్లో చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభం కానుంది.

కాగా, డైరెక్టర్ హెచ్‌.వినోద్‌ డైరెక్ట్ చేసిన, సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో మూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read More..

Jana Nayagan: విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

Next Story