- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jana Nayagan: విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్
జన నాయగన్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5 లక్షల టికెట్ల అమౌంట్ వెనక్కి ఇచ్చేశారు. దీంతో పాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్ కు 50 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందట.

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన జన నాయగన్ ( Jana nayagan ) సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తి కాకపోవడంతో మూవీ వాయిదా పడిందట. దీంతో ఈ జన నాయగన్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఇక కొత్త తేదీని త్వరలోనే రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. కానీ జనవరి 9వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని చాలా మంది అభిమానులు టికెట్ కొనుగోలు చేశారు.
సినిమా వాయిదా పడడంతో అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు. సినిమా కొత్త తేదీని ఇంకా ప్రకటించకపోవడంతో బుక్ మై షో ద్వారా టికెట్లు కొన్న వారికి రిఫండ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5 లక్షల టికెట్ల అమౌంట్ వెనక్కి ఇచ్చేశారు. దీంతో పాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్ కు 50 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందట.
సంక్రాంతి నుంచి మరో సినిమా ఔట్?
సంక్రాంతి బరి నుంచి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీ లీల, శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా కూడా వాయిదా పడబోతుందట. జనవరి 10వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను తెలుగులో వాయిదా వేస్తున్నారట. ఇక్కడ థియేటర్లు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.






