వాయిదా పడిన కృతి శెట్టి మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-08-21 11:24:43  IST  )

యంగ్ బ్యూటీ కృతి శెట్టి, డైనమిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘LIK’

వాయిదా పడిన కృతి శెట్టి మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కృతి శెట్టి, డైనమిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘LIK’ (లవ్ ఇన్సురెన్స్ కంపెనీ). దీనికి విఘ్నేఫ్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార, ఎస్‌ఎస్ లలిత కుమార్ నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. మూవీ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. నిజానికి సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు ‘LIK’ చిత్రం అక్టోబర్ 17న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘ఈ దీపావళికి ప్రేమ పండగ జరపుకుందాం’ అంటూ దీవాళి స్పెషల్‌గా రాబోతున్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story