Manchu Manoj: వాళ్లను అడ్డం పెట్టుకోకు కూర్చొని మాట్లాడుకుందాం.. మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్.. విష్ణును ఉద్దేశించేనా?

by Hamsa |   ( Updated:2025-01-18 16:17:53.0  )
Manchu Manoj: వాళ్లను అడ్డం పెట్టుకోకు కూర్చొని మాట్లాడుకుందాం.. మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్.. విష్ణును ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: మంచు ఫ్యామిలీలో గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. పెద్దలకు నివాళులు అర్పించేందుకు తిరుపతి యూనివర్సిటీ వద్దకు మనోజ్(Manchu Manoj) వెల్లగా.. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక నిన్నటి నుంచి మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. వరుస ట్వీట్లతో మనోజ్, విష్ణు తమదైన శైలిలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.

మంచు విష్ణు(Manchu Vishnu) ఓ డైలాగ్‌ను షేర్ చేయగా.. దానికి మనోజ్ కూడా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, మనోజ్ తన ట్విట్టర్ ద్వారా సానుకూలంగా స్పందించారు. ‘‘విస్మిత్ మగాళ్లలా నువ్వు నేను ఎదురెదురుగా మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఆడవాల్లను, నాన్నను అడ్డం పెట్టుకోకు. ఈ సమస్యను తీయ్యగా పరిష్కరించుకుందాం. ఏమంటావు? విస్మిత్ మగాడిలా బిహేవ్ చేయు.. నేను ఒంటరిగా వస్తానని మాటిస్తున్నాను.

నీకు నచ్చిన వాళ్లను తెచ్చుకో. బహిరంగంగా, ఆరోగ్యకరంగా మన సమస్యను పరిష్కరించుకుందాం. ఇట్లు మీ కరెంట్ తీగ’’’’ అని రాసుకొచ్చారు. అలాగే బ్రహ్మానందం నటి హేమను చెంప గిల్లుతున్న ఫొటోను షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ మనోజ్ అన్న విష్ణును ఉద్దేశించి పెట్టాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు కొందరు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు కేసులు పెట్టుకుని మళ్లీ ఇప్పుడు ఎలా కలిసిపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.


Read More..

Manchu Family: ఆగని గొడవలు.. మంచు మనోజ్ మరో సంచలన ప్రకటన

Advertisement

Next Story

Most Viewed