Lenin: 24 గంటల్లో కుమ్మేసిన 'మనోడు వస్తున్నాడు'.. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు

by Pulgam srinivas |

'లెనిన్' మూవీ ‘మనోడు వస్తున్నాడు’ టీజర్‌కు 24 గంటల్లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Lenin: 24 గంటల్లో కుమ్మేసిన మనోడు వస్తున్నాడు.. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ - భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ‘మనోడు వస్తున్నాడు’ అనే పేరుతో మేకర్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా టీజర్‌లో అఖిల్ మాస్ అవతార్, యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఇక ‘లెనిన్’ మూవీ ‘మనోడు వస్తున్నాడు’ టీజర్‌కు 24 గంటల్లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకుంటాడా? లేదా అనేది చూడాలి.




Next Story